గణపతి నవరాత్రులు

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 07:01

గణపతి సాధన 

2015 వ సంవత్సరం నవంబర్  నుంచి 2016 జూలై వరకు గోచారంలో ఉన్న గ్రహస్థితి వల్ల రాబోయే ఇబ్బందులకు 12 రాశులు వారు చెయ్యవలిసిన గణపతి మంత్రముల వివరాలు.

ఇంకా నవంబర్  చాలా రోజులు ఉంది కదా.  ఇప్పుడు అంటే గణపతి నవరాత్రులలో  జపం మొదలు పెడితే అప్పటికి సిద్ది పొందుతారు.  నవంబర్ నుంచి వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో తరువాత చెప్పబడుతుంది  మహాగణపతి 32 రూపాల్లో ఉంటాడు. వాటిల్లో కొన్ని సాత్విక రూపాలు కొన్ని ఉగ్ర రూపాలు ఉంటాయి.  ఉచ్చిష్ట గణపతి మంత్రం వంటివి  అందరూ  చేయరు.  క్రింది మంత్రాలు గణపతి నవరాత్రులలోనూ తరువాతకూడ చేసుకోవచ్చు. దేవప్రశ్న విధానంలో పరిశీలించి రాబోయే కాలంలో జన్మరాశులు రీత్యా రాబోయే ఇబ్బందులు పరిశీలించి వాటిని తప్పించుకోవడానికి సులభంగా అందరూ చేసుకొనే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది.

ఉత్తమమైన గణపతి మూర్తులు(విగ్రహాలు):  మట్టి వినాయకుడు. పగడం వినాయకుడు, మరకత గణపతి(ఆకుపచ్చ గణపతి), స్పటిక గణపతి, రజిత గణపతి (వెండి వినాయకుడు), పసుపు వినాయకుడు ఇలా మీకు వీలైన గణపతికి కాని గణపతి యంత్రానికి కాని గరిక, ఎరుపు అక్షింతలు పువ్వులతో పూజించి జపం చేయండి.

గణపతి నవరాత్రుల్లో 12 రాసులు వాళ్ళూ చెయ్యవలిసిన జపం

మేషరాశి:      విజయ గణపతి

వృషభరాశి:    క్షిప్ర గణపతి

మిథునరాశి:  విద్యా గణపతి

కర్కాటకరాశి: లక్ష్మీ గణపతి

సింహ రాశి :  విద్యా గణపతి

కన్యారాశి   : శక్తి గణపతి / దుర్గాగణపతి

తులారాశి : విజయ గణపతి

వృశ్చికరాశి: విజయ గణపతి

ధనుస్సురాశి: శక్తి గణపతి

మకరరాశి:  మహాగణపతి

కుంభరాశి :  విజయ గణపతి

మీన రాశి: చింతామణి గణపతి 

అన్ని మంత్ర్రాలను బహిరంగంగా చెప్పకూడదు కాబట్టి మంత్రాలను ఇవ్వడములేదు.  మంత్రం ఉపదేశం లేనివారు పైన చెప్పిన గణపతి పేరు ముందు ఓం గం అని చివర నమః అని  చేర్చి జపం చేయవచ్చు.

ఉదాహరణకు   విజయ గణపతి :  ఓం గం విజయ గణపతయే నమః

అలవాటు ఉన్నవారు గణపతి సూక్తం, గణపతి అధర్వశీర్షం పారాయణ చేసుకోవచ్చు.

గణపతికి నివేదన : బెల్లం, అటుకులు, చెరుకు, గోధుమపిండి, చలివిడి, ఉండ్రాళ్ళు.  వీటిలో మీకు వీలు అయినవి నివేదన చేయవచ్చు.

ఓం తత్సత్.

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.