నరకం - నరకంలో విధించే శిక్షలు వాస్తవమేనా ?

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:06

నరకం - నరకంలో విధించే శిక్షలు వాస్తవమేనా ?

గరుడపురాణం గురించి , నరకంలో విధించే శిక్షలు గురించి మనలో చాలామందికి  తెలుసు.  దేవీభాగవతంలో  సావిత్రి-యమధర్మరాజు సంవాదంలో  కూడా చాలా రకాల పాపాలు వాటికి విధించే శిక్షలకి సంభందించిన  వివరణ ఉంటుంది.  వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.  కొన్ని శిక్షలు నరకంలో కాకుండా కొన్ని భూలోకంలోనే విధంపబడతాయి.  ఆ విషయం   ఆ శిక్షని అనుభవించే వారికే తెలియదు.    అవి ఎలాగో చూద్దాం.

సూచిముఖి:
గరుడపురాణంలో శిక్ష:  శరీరాన్ని బొంతవలే కుట్టడము.
భూలోకంలో అనుభవం:   పెద్దవాహన ప్రమాదం జరిగి ఎముకలు విరిగితే ఆపరేషన్ చేసి  శరీరంలో స్టీల్ ప్లేట్స్ పెడతారు.  బ్రెయిన్ సర్జరీ, సిజిరెన్ ఆపరేషన్, స్కిన్ డ్రాఫ్టింగ్,  ఇలాంటివి దీనికి  కొన్ని ఉదాహరణలు.
అసిపత్రవనం:
గరుడపురాణంలో శిక్ష:  శరీరంను కత్తులతో కోయడము.
భూలోకంలో అనుభవం:   కేన్సర్ కిచేసే వైద్యంలో ఆపరేషన్ తరువాత చేసే కీమో థెరఫి, లేసర్ ట్రీట్మెంట్, లాప్రోస్కపీ.  గ్రామాల్లో పొలం పని చేసేవారికి  అరికాలిలో  ఆనలు అని వస్తాయి.  వాటిని తీసేటప్పుడు ఆ రోగి ప్రత్యక్ష నరకాన్ని చూస్తాడు
పూయోద:
గరుడపురాణంలో శిక్ష:  మల- మూత్రాలతో నిండిన సముద్రంలో పడవేయడం
భూలోకంలో అనుభవం: వర్షకాలంలో మాన్ హోల్ పడి మరణించడము, మాన్ హోల్ లోనికి దిగి శుభ్రం చేయడం ఇలాంటివి .
సారమేయోదనము:
గరుడపురాణంలో శిక్ష:   కుక్కలతో కరిపించడం.
భూలోకంలో అనుభవం:  వీధిలోని పిచ్చికుక్కలు కరవడం.
శూలప్రోతం:
గరుడపురాణంలో శిక్ష: శూలములచే పొడవబడడం.
భూలోకంలో అనుభవం:  షుగర్ వచ్చినవాళ్లు రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవడం, పైల్స్ (మూల శంఖ) వచ్చినవాళ్ళకి  ముళ్ళమీద కూర్చున్నట్టుగా ఉంటుంది.  కొన్ని రకాల మసాజ్ లు చేసేటప్పుడు ముళ్ళకర్ర వంటి దానితో శరీరంపై రుద్దుతారు.

కొన్ని రకాల వైద్యాలలో  జలగలతొ రక్తం పీల్పించడము, ఆక్యుపంచర్ వైద్యంలో సూదులతో గుచ్చడం, ఫిజియో థెరఫి, బాక్సింగ్ లాంటి ఆటలు, బుల్ ఫైట్ లాంటి ఆటలు మరికొన్ని ఉదాహరణలు.
ఇదేవిధంగా నైట్ డ్యూటీ చేసే వాచ్ మాన్, సెక్యూరిటీ గార్డులు, గూడ్స్ రైల్లో గార్డులు, గేటుమాన్లు, బొల్లి( పాండురోగం), మూర్చ(ఫిట్స్), పక్షవాతం, గ్లకోమా, రేచీకటి, నత్తి, చిన్న వయస్సులొ  ఆడవారికి గర్భాశయం తీసివెయవలిసిరావడము, మగవారిలో నపుంసకత్వం, ఇంకా చాలా శిక్షలు ఇక్కడే అనుభవిస్తున్నప్పటికీ  ఆ విషయం వారికే తెలియదు.  మరి ఇలాంటి దోషాలును శిక్షలను జ్యోతిషశాస్త్ర సహాయంతో తెలుసుకోవచ్చా?
తెలుసుకోవచ్చు. జాతకం నిశితంగా పరిశీలన చేస్తే ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలుసుకొని  తగిన పూజలు పరిహారాలు చేసుకొంటే  ఇలాంటి ఇబ్బందులు తగ్గుతాయి.  నిత్యజీవితంలో  వచ్చే అనేక సమస్యలు వాటికి సరైన సమాధానాలు చెప్పేదే దెవప్రశ్న. దేవప్రశ్న ఇలాంటి అనేక సమస్యలకు సమాధానం చెబుతుంది

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.