కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి రహస్యం

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:29

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి  అంత  ధనం ఎలా వస్తుంది.  కారణం మీకు తెలుసా?  శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర శ్రీయంత్రం ప్రతిష్టించారని అంటారు.  కాని దానిలో వాస్తవం ఎవరికీ తెలియదు.    శ్రీ వేంకటేశ్వరస్వామి వక్షస్థలంఫై  లక్ష్మీదేవి ఉంటుందని అందరికి తెలిసినా  ఆ లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందని ఆమెకి ఒక ప్రత్యేకమైన మంత్రం  స్తోత్రం ఉన్నాయని చాలా  కొద్దిమందికి మాత్రమే తెలుసు.  ఈ లక్ష్మీ రూపాన్ని వ్యూహలక్ష్మి అంటారు.  ఈమెకు ఒక మంత్రం. స్తోత్రం, పూజావిధానం ఉన్నాయి.  ఈ స్తోత్రం లోని నామాలతోనే తిరుమలలోని  శ్రీవేంకటేశ్వర స్వామివారి వక్షస్థల లక్ష్మికి రోజూ పూజ చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరం అయిన శ్రావణమాసంలో లక్ష్మీ ఆరాధన వల్ల అన్ని  శుభాలు పొందుతారు.  ఈ వ్యూహలక్ష్మీ మంత్రం స్తోత్రంతో  కనకధారా స్తోత్రం పారాయణ మూలంగా సకల శుభాలు పొందుతారు. 

ఈసంవత్సరం  శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత  ఉంది. శ్రావణ మాసంలో నోములు నోచుకొనే వారు సెనగలని పసుపు నీటిలో నానపెట్టి వాయినం ఇస్తారు.  సెనగలు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? అదీ పసుపు నీటిలో నానపెట్టాలి? మామూలు నీటిలో నానపెపెట్టకూడదా? జ్యోతిషశాస్త్రం ప్రకారం   పసుపుకి, సెనగలకి గురుడు కారకడు.  ఈ గురుడు సంపదకు కారకుడు.  ఈ గురుగ్రహం ప్రీతి   అయిన పసుపు నీటిలో నానపెట్టిన సెనగలు వాయినం ఇవ్వడం మూలంగా గురుగ్రహం  ప్రీతి   పొందితే ఐశ్వర్యం పొందుతాము. ఈ సంవత్సరం  నారాయణ స్వరూపుడు అయిన సూర్యభగవానుడు సింహరాశిలో దేవగురువు   గురునితో కలిసి ఉన్న ఈ శ్రావణమాసంలో వ్యూహలక్ష్మి మంత్రం జపం , వ్యూహలక్ష్మి స్త్రోత్రం పారాయణం చేసి మీరందరు లక్ష్మీకటాక్షం పొందాలని  కోసం  మీఅందరికోసం ఇస్తున్నాను.  వీలయితే వీటితోపాటుగా ఇంద్రుడు చేసిన మహాలక్ష్మి స్తుతి కూడా చేసి లక్ష్మీ  అనుగ్రహం పొందండి.

వ్యూహలక్ష్మి మంత్రం : 
ఓం శ్రీం హ్రీం ఓం లక్ష్మ్యై నమః  పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థల స్థితాయై హ్రీం ఓం స్వాహా

వ్యూహలక్ష్మి స్తోత్రం:

ఓం నమశ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః !
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః!!
ప్రసన్న ముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః!
నమో బిల్వవనస్థాయై విష్ణు పత్న్యై నమో నమః !!
విచిత్ర క్షౌమ ధారిణ్యై పృధుశ్రోణ్యై నమో నమః!
పక్వబిల్వఫలాపీన తుంగ స్తన్యై నమో నమః!!
సురక్త పద్మపత్రాభ కరపాదతలే శుభే !
సురత్నాంగదకేయూర కాంచీనూపుర శోభితే !!
యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే !
మాంగల్యాభరణైః చిత్రైః ముక్తాహారైః విభూషితే!!
తాటంకైరవతంసశ్చ శోభమాన ముఖామ్భుజే!
పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరి వల్లభే !!
ఋగ్యజుస్సామ  రూపయైవిద్యాయై తే నమో నమః!
ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైరాలోకయ అబ్దిజే!!
యే దృష్టా స్తే త్వయా బ్రహ్మ రుద్రేంద్రత్వం సమప్నుయుః !! 

ఆవు నెయ్యి తో  దీపం పెట్టి రోజూ మూడు సార్లు పారాయణం చెయ్యాలి .
తీపి పదార్ధం నివేదన చేయాలి.
                                  ఓం తత్సత్

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.