పునర్జన్మ(ఎనిమిదవ భాగం )

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:50

పూర్వజన్మకర్మ ఏ రూపంలో వస్తుంది :

పూర్వజన్మకృతం  పాపం వ్యాధిరూపేణ పీడిత అంటారు. అనగా పూర్వజన్మల్లో చేసిన పాపాలు వ్యాధి రూపంలో పీడిస్తాయి అని. ఇక్కడ వ్యాధి అంటే అనారోగ్యం అది శారీరకం లేదా మానసికం.  ఈ రెండు తప్ప వేరే అనారోగ్యం లేదు.  సరిగ్గా ఇక్కడే కర్మ ప్రభావం గుర్తించాలి. ఎలా?

జాతకచక్ర రాసేటప్పుడు ఓకే శ్లోకం రాస్తారు.  ఈరోజుల్లో కంప్యూటర్ లో ఇలాంటివి ఏవి ఉండవు.

అశ్లోకం :

జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీం కులసంపదాం ! పదవీః పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రికాః

అనగా ఈ జాతకుడు అతని పూర్వపుణ్యాలని అనుసరించి తల్లి-తండ్రులను సుఖించేలా,  సంతోషించేలా ఉండి వంశవృద్ది కలిగించు గాక అని అర్ధం. ఇక్కడ తల్లి-తండ్రులు సుఖించేలా అనగా కుమారుడు అన్ని రకాలుగా అభివృద్దిలో ఉంటే వారు సుఖంగానే ఉంటారు కదా.

పూర్వపుణ్య కర్మలని అనుసరించి ఇతని జీవితం ఉంటుంది .  అందుకే పిల్లవాడు జన్మిచిన వెంటనే జన్మనక్షత్ర దోషాలు,  బాలారిష్ట దోషాలు, మాతృ-పితృ ఘాతక దోషాలు పరిశీలన చేస్తారు. వాటికి పరిహారం చేసుకుంటారు.  పిల్లవాడి ఆయుర్దాయం బాలారిష్టదోషం, పితృ-మాతృ జాతకంలో దోషాలు, బ్రహ్మ శాపం మొదలైనవాటి వల్ల నిర్ణయం అయి ఉంటుంది. తెలుగులో ఒక సామెత  బ్రతికిఉంటే బలుసు ఆకు తినైనా బ్రతకవచ్చు.  మనిషి బ్రతికి ఉంటె ఏమైనా చేయవచ్చు(కర్మ దోషాలు తొలగించుకోవచ్చు).  అందుకే 7 సంవత్సరాల వయస్సు వచ్చే  వరకు ఆయుష్య హోమం చేస్తారు.  తరువాత ఉపనయనం చేస్తే ఆ పిల్లవాడు గాయత్రి జపం చేసుకుటే జ్ఞానం కలిగి జేవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకుంటాడు.
పై విషయాలనిబట్టి మనకు ఒక విషయం అర్ధం అవుతుంది.  మనషి జన్మించగానే అతని నీడలా అతని పూర్వజన్మ కర్మలు వెంటాడుతూనే ఉంటాయి అని అర్ధం అవుతుంది. కొంతమంది పిల్లలు పుట్టుగుడ్డి, చెముడు, మెదడు సరిగా పెరగక పోవడము, గుండెలో చిన్న కన్నం, హెపటైటిస్, ఎయిడ్స్  లాంటి జబ్బులతో పుడతారు.  ఇవి కూడా పూర్వజన్మల కర్మలే.

జాతకచక్రంలో కనబడేవి కొన్ని కనబడనివి కొన్ని కర్మలు ఉంటాయి.  సాధారణ జ్యోతిష సూత్రాలతో ఈ కర్మలను గుర్తించలేరు.  కొన్ని ప్రత్యెక గ్రంధాలు అధ్యయనం చేయవలిసి ఉంటుంది.

ఒక చిన్న ఉదాహరణ:  ఒక మనిషి పొట్టిగా ఉన్నాడు.  దీనికి కారణం  ఏమిటి.  ఊహిచండి.  కర్మసిద్దాంతం ప్రకారం ఒక భార్య-భర్త పడుకొనే మంచం మీద వారు కాకుండా వేరొకరు పడుకుంటే వాళ్ళు తరువాత జన్మలో పొట్టిగా పుడతారు అని శాస్త్రం చెబుతుంది.  రేచీకటి లేదా  రంగులను గుర్తించలేకపోవడం (కలర్ బ్లైండ్ నెస్), నీటికాసులు (గ్లకోమా) ఇలాంటి  గుడ్డితనానికి దారితీసే జబ్బులు పూర్వ జన్మల్లో ఆవు కంట్లో  పడుననైన సూదితో గుచ్చడం వల్ల వస్తాయి అని శాస్త్రం చెబుతుంది. అబద్దాలు ఆడేవారు తరువాతి జన్మలో నత్తి వారుగా పుడతారని, ఇంట్లో భార్య ఉండగా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకునేవారు తరువాతిజన్మలో నపుంసకులు గా పుడతారని, వావి వరుసలు మరిచి ప్రవర్తించేవారు కుక్క జన్మ ఎత్తుతారని ఇలా చాలా రకాలుగా కర్మదోషాలు వెంటాడుతూ ఉంటాయి.

ఒక చిన్న గమనిక:   ఇక్కడ శాస్త్రంలో అని మాత్రమే చెబుతున్నాను ఆ గ్రంధాల పేర్లు  రాయట్లేదు.  ఎందుకు అంటే ఒక పెద్దమనిషి వరలక్ష్మీవ్రతం విధానం నా వెబ్ సైట్ లో కాపీ చేసి తాన పరిశోధన చేసాను అని చెప్పి ఒకచోట పూజ చేయించి 5,5౦౦ రూపాయలు తీసుకున్నాడు.  ఇలా శాస్త్రం దుర్వినియోగం అవ్వకూడదు అని సమాచారం ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వడం జరుగుతోంది.

కర్మదోషం ముందుగా సూక్ష్మశరీరంను తరువాత కారణ శరీరాన్ని తరువాత స్థూల శరీరాన్ని (భౌతిక శరీరాన్ని) ప్రభావితం చేస్తుంది. 

దేవప్రశ్న సహాయంతో ఇలాంటి పూర్వజన్మల కర్మలను పరిశీలన చేసి ఇప్పుడు వాటి ప్రభావం ఎలా చూపుతుందో ఎప్పుడూ చూపుతుందో తెలుసుకోవచ్చు. కొన్ని కర్మలు తీవ్రత తప్పించుకోవచ్చు. కొన్ని కర్మలు అనుభంవిచ వలిసిందే. ఈ తప్పని వాటినిగురించి ముందే తెలుసుకొంటే వాటి పరిణామాలు ఎదుర్కోవాడానికి సిద్దపడవచ్చు.

కొన్ని జ్యోతిష శాస్త్ర సంభందమైన విషయాలు కర్మ సిద్దాంతానికి అనుసంధానం చేసి మరొక టపాలో మళ్ళీ కలుస్తాను.

ఓం  తత్సత్.

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.