పూర్వజన్మ(తొమ్మిదవ భాగం )

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:48

పునర్జన్మ సిద్దాంతం ప్రకారం మానవుడు  అనుభవించే సుఖ-దుఖాలకు పూర్వజన్మ కర్మే కారణం అనుకొంటే పూర్వజన్మ వివరాలు తెలుసుకొని ఆ దోషాలకు పరిహారం చేసుకోనేవీలు ఉందా?పూర్వజన్మ వివరాలు తెలుసుకోగలమా? ఎలా?

జ్యోతిషశాస్త్రం ప్రకారం జీవుడు ఏ లోకం నుంచి వచ్చాడు అనేది తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలు వున్నాయి. అలాగే పూర్వ జన్మ కర్మల పరిశీలన కూడా కొంత వరకు ఉంది.  కాని జాతకచక్రం ప్రకారం కొంతవరకే చెప్పవచ్చు. మానవుడు పుట్టినపుడు జాతకచక్రం గతజన్మ అనుసరించి  అతనికి ఆక్షణం(జన్మించే వరకు) ఉన్న కర్మఫలం  చెబుతుంది. ఆ తరువాత జీవుడు మరల కొంత కర్మ చేస్తాడు. గతజన్మల కర్మలకు ఇది తోడు అయి  రాబోయే కాలంలో ఎదుర్కోబోయే పరిస్థితులను(కష్టాలు  లేదా సుఖాలు) నిర్ణయిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎలా వస్తాయో   జాతకంలో తెలుసుకోవడం చాలా కష్టం.  ప్రత్యేకమైన ప్రశ్నశాస్త్రం, ఉపాసన సహాయంతో రూపొందిచబడిన  దేవప్రశ్న ఇలాంటి క్లిష్ట మైన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. దేవప్రశ్న ద్వారా గతజన్మల్లో ఎలాంటి జన్మలు తీసుకొన్నారు, ఎలాటి కర్మలు చేసారు , దాని ప్రభావం ఈ జన్మలో ఎలా ఉంటుందో తెసులుకోవచ్చు. దేవప్రశ్న సహాయంతో వారు గత జన్మల్లో ఏ దేవత ఉపాసన చేసారో ఈ జన్మలో  ఏ దేవతను ఉపాసన చేస్తే మంచిదో తెలుసుకోవచ్చు. కులదేవత, ఇష్టదేవత, ఉపాస్యదేవత ఎవరో తెలుసుకోవడంవల్ల నిత్యజీవితంలో వచ్చే ఇబ్బందులు సులభంగా అధిగమించవచ్చు. జాతకంలో కనబడే చాలా దోషాలు గతజన్మల నుంచి ఎలా సంక్రమించాయో ఎన్ని జన్మలనుంచీ సంక్రమించాయో తెసులుకొని వాటికి తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఎదుర్కొనే కష్టాలనుంచి విముక్తి పొందవచ్చు, అంతేకాకుండా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఏమిచేయాలో కూడా దేవప్రశ్న ద్వారా తగిన సలహాలు పొందవచ్చు.

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.