పూర్వజన్మ- పునర్జన్మ(ఐదవ భాగం)

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:54

గతజన్మవైరం:

కొన్నిసార్లు కొత్తగా పరిచయం అయిన మనిషి మీద కారణం లేకుండా ప్రేమ లేదా ద్వేషం కలుగుతుంది. దీనికి కారణం గతజన్మల సంభందం. ఉద్యోగంలో ఉన్నవారికి ఇలాంటి అనుభవం తరుచూ కలుగుతుంది. ఎలాగంటే కొంతమంది ఎంత బాగా పనిచేసినా వారి పైఅదికారి (boss) కి వారి పని నచ్చదు, అంతేకాకుండా పని సరిగా చెయ్యని వారికి ప్రమోషన్ ఇవ్వడం జరుగుంటుంది.

ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కాక పని సరిగా చెయ్యలేక ఉద్యోగం మానేస్తూ ఉంటారు. దీనికి కారణం ఆ అధికారిని గతజన్మల్లో అతడు వేధించి ఉంటాడు. తరువాత జన్మలో కర్మఅనుభవించే సమయంలో పై అనుభవం పొందుతాడు. దీన్ని తెల్సుకోనేవిధానం, వారి జాతకంలో ఉద్యోగ  సంబంధ విషయాలని  పరిశీలించి, వారి గతజన్మ కర్మలను సరైన ప్రశ్న పద్దతిలో పరిశీలించాలి. దానికి తగిన పరిహారం చేసికొంటే ఆరకమైన దోషాలు తొలగిపోతాయి. కొంతమంది తల్లి-తండ్రులు వాళ్ళ పిల్లలకంటే బయటి పిల్లలను ఎక్కువగా ముద్దు చేస్తారు. వాళ్ళ పిల్లలు చేసేది వాళ్ళకి నచ్చదు. దీనికి మనకు తోచిన కారణం మనం చెప్పుకొన్నా జ్యోతిష శాస్త్రం ప్రకారం , దేవప్రశ్న ప్రకారం జాతకం మరియు ప్రశ్నలో సంతాన సంబంధ విషయాలని,పిల్లల జాతకంలోతండ్రికి సంబంధించిన విషయాలని  పరిశీలించి, గతజన్మల్లోని శాపాలు లేదా దోషాలను గుర్తించి తగిన పరిహారం చేసికొంటే ఆ దోషం తోలిగిపోతుంది. ఇలాగే అన్న-తమ్ములు, అక్క- చెల్లెళ్ళు, తోడికోడళ్ళు, అత్తాకోడళ్లు, మామ-అల్లుడు, ప్రక్కింటి వారితో ఇలా అనేక చోట్ల కారణం లేకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి. వీటిని సరైన పద్దతిలో విశ్లేషించి తగిన పరిహారం చేసుకొంటే ఆ బాధలు తొలిగిపోతాయి.

దేవప్రశ్న ద్వారా అనేకమందికి ఇలాంటి సమస్యలకు తగిన పరిష్కారం సూచిచడం జరిగింది.

ఓం తత్సత్

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.