పునర్జన్మ (ఏడవ భాగం)

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:51

 కర్మ అనుభవం

పూర్వజన్మల్లోని కర్మలు ఈజన్మలో ఎప్పుడు ఎలా ఏరూపంలో అనుభవంలోకి వస్తాయి, తెలుసుకోవడం వీలుఅవుతుందా

ఈ విషయం తెలుసుకోనేముందు మరొక విషయం గురించి కొంత తెలుసుకోవాలి.  కర్మదోషం అనుభవించేది శరీరం. ఇక్కడ శరీరం అంటే నాలుగు శరీరంలు ఉంటాయి.

1.స్థూల శరీరం  2. సూక్ష్మ శరీరం 3. కారణ శరీరం  4. మహాకారణ శరీరం.

1. స్థూల శరీరం: 

ఇది మన కంటికి కనబడే భౌతిక శరీరం.  మానవుడు కర్మలను  చేసేది వాటిని అనుభివించేది దీనితోనే.  పూర్వజన్మల  కర్మలను అనుసరించి జీవుడు ఏ జాతి, మతం, కులం, సంఘం,  స్త్రీ,   పురుష , నపుంసక భేదాలతో జన్మిచాలో నిర్ణయం అవుతుంది..  ఇలా జన్మిచిన తరువాత వారికి పాప పుణ్య వివేచన ఉంటుంది.  వారి వివేచేనా జ్ఞానంతో వారు చేసే కర్మలకు వారే భాద్యులు అవుతారు. ఎలా?

చిన్న ఉదాహరణ.  మనింట్లోకి ఒక పాము వచ్చింది అనుకోండి. మనదగ్గర ఒక కర్ర ఉంది. మనలను మనం కాపాడుకోవాడానికి రెండు మార్గాలు 1. కర్రతో పాముని బయటకి తరమడం.  2.కర్రతో పాముని కొట్టి చంపడం.  సాధారణంగా అందరూ చంపుతారు.  అంటే ఇక్కడ పాపకర్మ తప్పించుకొనే అవకాశం ఉన్నా పాపకర్మే చేస్తారు. ఈ పాపకర్మ అనుభవించాల్సిందే.  ఇది వ్యాధి రూపంలో లేదా వేరొక రూపంలో వస్తుంది.  ఇలాగే చేసిన  పాపకర్మలను అనుసరించి వారికి కష్టాలువస్తాయి.

2.సూక్ష్మ శరీరం

అంగుష్ఠ మాత్ర పురుషః అంటుంది శాస్త్రం.  భౌతిక శరీరంలో జీవుడు అంగుష్ఠ ప్రమాణం (సుమారు ఒక అంగుళం) ఉంటాడు.  జీవుడు ఉండేది ఎక్కడ? రెండుచేతుల వేళ్ళూ చాపి

కుడిచేతి బొటన వ్రేలు  గొంతుకింద ఉండే కన్నంలో ఉండేలా,ఎడమచేతి చిటికెన వ్రేలు బొడ్డులో ఉంచి రెండు చేతుల వెళ్ళు పొడవుగా జాపితే కుడిచేయి చిటికెనవ్రేలు ఎడమచేతి బొటనవేలు కలిసి ఉండే ప్రదేశంలో జీవుడు ఉంటాడు. మానవుని గతజన్మల కర్మలకి,ప్రస్తుత జన్మకర్మలకి రాబోయే కాలంలో వచ్చే పరిస్థితులకి ఈ జీవుడే సాక్షీభూతుడు.

3.కారణ శరీరం :

మానవుని చుట్టూ ఉండే తేజో వలయం.  దీన్నేఇంగ్లీష్ లో (aura) అంటారు. సామాన్యులకి ఈ తేజో వలయం 8 అంగుళాలు ఉంటుంది.  యోగులకి, ఉపాసనపరులకి చాల ఎక్కువగా ఉంటుంది.  మానవునకి శరీరంనకు వ్యాధి వచ్చేముందు ఈ తేజో వలయం దెబ్బతింటుంది.  ఉదాహరణకి  ఒక మనిషికి రాబోయే కొద్ది రోజుల్లో ఒక యాక్సిడెంట్లో తలతెగి మరణించే యోగం ఉంటే యోగదృష్టిలో చూడగలిగే వారికి అతని తలలేకుండా మిగిలిన శరీరం(తేజో వలయంలో) కనబడుతుంది.అంటే కర్మఫలం ముందుగా కారణ శరీరం మీద ప్రభావం చూపుతుంది.  కొంతమంది యోగ సాధకులు,ఉపాసకులు ,సిద్దులు తాము మరణించే సమయాన్ని ముందుగానే చెబుతారు. వారు మరణానికి కారణం అయిన  కారణ శరీర పతనాన్ని ముందుగానే గమనించుకోగలుగుతారు.  ఆవిధంగా వారి మరణం ముందుగానే వారికి తెలిసిపోతుంది.  అలాగే ఎదుటివారి మరణాన్ని  కూడా ఆరకంగానే గుర్తిస్తారు

4. మహాకారణ శరీరం : 

దీని గురించి ఇలా బహిరంగంగా చర్చించకూడదు.

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.