సర్పదోష నివారణ

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:40

14-08-2015  ఆషాఢ అమావాస్య,శుక్రవారం, ఆశ్లేష నక్షత్రంతో కలిసి రావడం మూలంగా  కాలసర్పదోషం,సర్పదోషం, ఆశ్లేష నక్షత్రంలో జన్మించినవారు, రాహుదశ, కేతుదశలో ఉన్నవారు, మిథునరాశి, సింహరాశి, కన్యారాశి, కుంభరాశి వీటిలో జన్మిచిన వారు సర్పదోష పరిహార పూజ చేసుకొంటే మంచిది.  వీలు అయితే ఒక బ్రాహ్మణుడిని పిలుచుకొని పూజ చేయించుకోవడం మంచిది.  అలా వీలు కాని వారు  మీ ఇంట్లో మీరు చేసుకొనే విధంగా క్లుప్తంగా ఓక పూజ పద్దతిని ఇక్కడ ఇస్తున్నాను.  ఈ పూజ ఉదయం 07.30  గం. తర్వాత చేయాలి.
    ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.  తరువాత మంతపారధన చేసుకోవాలి

Serpent cure

ఒక క్రొత్త తువ్వాలుఫై  బియ్యం పోసి మధ్యలో కలశం పెట్టుకోవాలి.  కలశంలో మానసాదేవిని ఆవాహన చేసుకోవాలి.  పైన చూపినట్లు 1 నుంచి 11  వరకు తములపాకులో వక్క,ఖర్జూరం,  పసుపుకొమ్ము, రూపాయి కాసు పెట్టి క్రింద వరుసగా ఇచ్చిన దేవతలను 1 నుంచి 11 వరకు ఆవాహన  చేసికోవాలి

1. వాసుకి  2.కర్కోటకుడు    3. తక్షకుడు   4. శంఖపాలుడు    5.  మహాపద్మనాగుడు    6.  మహాశంఖనీలుడు  7.  కంబలుడు 8. ధనుంజయ శేషనాగుడు  9.ఐరావతనాగుడు   10.  ఇలాపుత్రుడు 11.అశ్వతర అనంత నాగుడు.

వరుసగా ఆవాహన చేసి పూజ చేసుకోవాలి .  చిమ్మిలి (బెల్లం+తెల్ల నువ్వులు) నైవైద్యం చేయాలి. కూర   గుమ్మడికాయ లేదా 11 నిమ్మకాయలు కోసి కుంకుమ అద్ది 11 నాగులకు బలిహరణం చెయ్యాలి.   తరిగిన కూర తినకూడదు. ఉల్లిపాయలు, మసాలా, మాంసాహారం తినకూడదు .  పూజ అయిన తరువాత ఆ మంటపంను  పారే నీటిలో వేయాలి.

ఇది చాలా సులభంగా చేసే పద్దతి.  వీలు అయితే పూర్తిగా పరిహారం చేసుకోవాలి .


                                              ఓం తత్సత్

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.